![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -478 లో..... జ్యోత్స్నకి శ్రీధర్ చెక్ ఇచ్చి నా కొడుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్ అంటాడు. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. కార్తీక్ చెక్ తీసుకొని శ్రీధర్ కి ఇచ్చి.. నాకు ఇలా ఇష్టం ఉండదు.. ఎవరి సాయం వద్దని కార్తీక్ ఖచ్చితంగా చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతాడు....
ఎందుకురా.. నువ్వు ఇలా డ్రైవర్ గా ఉండడం నాకు ఇష్టం లేదు.. సాయం చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావని కార్తీక్ పై శ్రీధర్ కోప్పడుతాడు. కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. అసలు కార్తీక్ ఎందుకిలా ఛాన్స్ వచ్చిన వాడుకోట్లేదు.. మనసులో ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుందని సుమిత్ర అంటుంది. నీతో మాట్లాడాలి దీప అని శ్రీధర్ బయటకు పిలుస్తాడు. అసలు కార్తీక్ ఎందుకు వద్దని అంటున్నాడు.. కారణం చెప్పమని శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తాడు. నాకు తెలియదని దీప అంటుంది. మీరు తననే అడగండి అని దీప అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
కొడుకు నిజం చెప్పడు.. కోడలు నిజం చెప్పదని శ్రీధర్ అనుకుంటాడు. మరొకవైపు జ్యోత్స్నకి శివన్ననారాయణ రెస్టారెంట్ గురించి టైమ్ ఇస్తాడు. దాని గురించి కనుక్కుంటాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |